పవన్ నెక్ట్స్ సినిమాకు దారేది?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెంటనే పట్టాలపైకి తీసుకొచ్చే సినిమా గబ్బర్ సింగ్-2. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్స్ లేవు. అయితే సినిమాల విషయంలో చాలా స్లోగా ఉన్న పవర్ స్టార్.. గబ్బర్ సింగ్-2తో పాటు సేమ్ టైం మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. ఆ మరో సినిమాపైనే ఇప్పుడు అందరి కన్నుపడింది. ఆ మరో సినిమాపైనే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. గబ్బర్ సింగ్-2 సినిమా డైరక్టర్-హీరోయిన్ కన్ ఫర్మ్ అయిపోవడంతో.. పవన్ ఇంకో సినిమా ఏంటనే చర్చ బాగా నడుస్తోంది ఫిలింనగర్ లో. 
 
దాసరి నారాయణరావుతో ఓ సినిమా చేస్తానని గతంలోనే మాటిచ్చాడు పవన్. మరి గబ్బర్ సింగ్-2తో పాటు దాసరి సినిమాని కూడా సెట్స్ పైకి తెస్తాడా అనేది వేచి చూడాలి. ఈ సినిమాకు నిర్మాతగా దాసరి కన్ ఫర్మ్ అయినప్పటికీ మిగతా డీటేయిల్స్ ఏవీ ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ మూవీ చేసేందుకు కూడా పవన్ ప్రిపేర్ అవుతున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కోసం త్రివిక్రమ్ ఓ కథ రాసుకున్నాడు. ఆ కథలో పవన్-అనుష్క జోడీని చూపించాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. మరి గబ్బర్ సింగ్-2తో పాటు ఈ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకొస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. 
 
అసలు తన కెరీర్ లో పవన్ ఎప్పుడూ ఒకేసారి రెండు సినిమాలు చేసిన దాఖలాలు లేవు. అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయ్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి నిన్నటి గోపాల-గోపాల సినిమా వరకు ఏ సందర్భంలో కూడా ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభించలేదు పవన్. మరి ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన స్టార్ హీరో, ఇప్పుడు ఇంత సడెన్ గా ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభిస్తాడా.. అసలు అంత అవసరం ఏమొచ్చింది..?