ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ప్రిన్స్

ఓవైపు శ్రీమంతుడు సినిమాను శరవేగంగా పూర్తిచేస్తూనే మరోవైపు కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయిస్తున్నాడు మహేష్. రీసెంట్ గా తన కుటుంబసభ్యులతో కలిసి సమ్మర్ వెకేషన్ కోసం మలేషియా వెళ్లాడు మహేష్. అక్కడ ఎంజాయ్ చేసిన ఓ ఫొటోను తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు కూడా. భార్య నమ్రతతో పాటు కొడుకు గౌతమ్, కూతురు సితార బోట్ లో కూర్చున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కొడుకు గౌతమ్ కు వేసవి శెలవులు ఇవ్వడంతో ఇలా ఫ్యామిలీతో కలిసి మలేషియా వెళ్లాడు మహేష్. 
కుటుంబంతో వెకేషన్ పూర్తయిన వెంటనే.. సినిమా యూనిట్ తో మరో వెకేషన్ ప్లాన్ చేశాడు మహేష్. ప్రస్తుతం చేస్తున్న శ్రీమంతుడు సినిమాకు సంబంధించి 2 పాటల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 17న శ్రీమంతుడు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.