సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న రానా

దగ్గుబాటి నటవారసుడు రానా రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆ ఫొటోను నెట్ లో కూడా పెట్టాడు. దీంతో ఇండస్ట్రీ మొత్తం షాకయింది. కానీ ఆ వెంటనే అదంతా ఉత్తుదే అని ఊపిరిపీల్చుకున్నారు. మేటరేంటంటే.. తన కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా ఇలా పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు రానా. కన్నడంలో హిట్టయిన బెంగళూరు డేస్ సినిమా రీమేక్ లో రానా నటిస్తున్నాడు. ఆర్య, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ తమిళ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. పీవీపీ బ్యానర్ పై నిర్మాణమవుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడు రానా. ఆ పాత్ర కోసమే ఇలా పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. కాకపోతే సెట్ అంతా చాలా సహజంగానే ఉండడంతో చాలామంది నిజంగానే రానా పెళ్లిచేసుకున్నాడేమో అని పొరబడ్డారు. మొత్తానికి ఒకేఒక్క ఫొటోతో అందర్నీ హడలెత్తించాడు ఈ దగ్గుబాటి వారసుడు. అన్నట్టు బెంగళూరు డేస్ తో పాటు రుద్రమదేవి సినిమాలో కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు రానా. ఈమధ్య సోలో హీరోగా కంటే ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.