కృష్ణా వార‌ధిపై స‌జీవ ద‌హ‌నం!

విజ‌య‌వాడ: అదుపు త‌ప్పిన వేగం ఓ నిండు ప్రాణాన్ని బ‌లిగొన‌గా… మ‌రో నిండు ప్రాణం చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతోంది. కృష్ణా న‌ది వార‌ధిపై ఇద్ద‌రు విద్యార్థులు మోటారు సైకిల్‌పై వెళుతూ వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు త‌ప్పి ప‌డిపోయారు. మంగ‌ళ‌గిరి ప‌రిధిలోని తాడేప‌ల్లి వ‌ద్ద జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో వై. సీతారామ‌రాజు అనే విద్యార్థి స‌జీవ ద‌హ‌న‌మై పోగా నారాయ‌ణ స్వామి అనే మ‌రో విద్యార్థి 75 శాతం గాయాల‌తో  ఆస్ప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య‌ చికిత్స పొందుతున్నాడు.  వీరి చేతిలో ల్యాప్‌టాప్‌ల‌తోపాటు ఒక‌రు దగ్ధ‌మై పోగా మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మోటారు సైకిల్ అదుపు త‌ప్పి ప‌డిపోవ‌డంతో సైలెన్సర్ నుంచి చేతిలో ఉన్న‌ టిన్న‌ర్‌కు నిప్పు ర‌వ్వ‌లు ఎగిసిప‌డి అంటుకోవ‌డంతో సీతారామ్‌కు మంట‌లు వ్యాపించి అక్క‌డిక్క‌డే స‌జీవ ద‌హ‌న‌మై పోయాడు. విజ‌య‌వాడ నుంచి గుంటూరు వ‌స్తున్న స‌మ‌యంలో ఈ దారుణం జ‌రిగిపోయింది.