కాంచన కేక అంటున్న సూపర్ స్టార్

కాంచన-2 సినిమా ఇక్కడింకా విడుదలకాలేదు. త్వరలోనే గంగ పేరుతో ఇది తెలుగుతెరపై కనువిందుచేయనుంది. కానీ కాంచన-2 మాత్రం తమిళనాట విడుదలై వారం రోజులైంది. రిలీజ్ అవ్వడమే కాకుండా అక్కడ మంచి రెస్పాన్స్ కూడా రాబట్టింది. ఇప్పుడీ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ చూశాడు. రాఘవ లారెన్స్ డైరక్షన్ లో తెరకెక్కిన కాంచన-2 బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నాడు రజనీకాంత్. గతంలో తను చేసిన చంద్రముఖి సినిమాను గుర్తుచేసుకున్నారు. తన అభిమాన నటుడి కోసం లారెన్స్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేశాడు. రజనీకాంత్ ఇంట్లోనే స్పెషల్ షో వేశారు. సినిమా చూసిన రజనీకాంత్, లారెన్స్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. లారెన్స్ తో పాటు నటించిన లక్ష్మీరాయ్, తాప్సిలను కూడా ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఇలాంటి సినిమా చేయాలంటే మంచి టేస్ట్ ఉండాలంటూ నిర్మాతను కూడా ప్రత్యేకంగా అభినందించారు. లారెన్స్-రజనీ కలవడంతో వాళ్లిద్దరూ కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారంటూ అప్పుడే తమిళ మీడియా పుకార్లు సృష్టించేసింది.