రాందేవ్ బాబా మ‌గ‌బిడ్డ మందు..

భార‌త‌దేశంలో భ్రూణ హ‌త్య‌లు మ‌హా పాత‌కం. గ‌ర్భంలో ఉంది మ‌గ శిశువా? ఆడ శిశువా అనేది తెల‌సుకునే ప‌రీక్ష‌లు కూడా నిషేధం. ఆడ‌బిడ్డ‌ల సంర‌క్ష‌ణ కోసం స్వ‌యంగా మోదీ ప్ర‌భుత్వం విస్తృత ప్ర‌చారాన్నే చేస్తోంది. కాని మ‌ను ధ‌ర్మ‌శాస్ర్తాన్ని పాటించే నేత‌లున్న బీజేపీ నేత‌ల్లో  స‌హ‌జంగానే కొన్ని విశ్వాసాలు, కొంత పుర‌షాధిక్య భావాలు క‌నిపిస్తున్నాయి. యోగా గురు రాం దేవ్ బాబా బీజేపీ మ‌ద్ద‌తుదారు. హ‌ర్యానా ప్ర‌భుత్వానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌. ఆయ‌న‌కు సొంతంగా ఆయుర్వేద ముందుల త‌యారీ సంస్థ‌లున్నాయి. అటువంటి యోగా గురు త‌యారుచేస్తున్న మ‌గ బిడ్డ మందు పార్ల‌మెంట్‌లో దుమారం రేపింది. పుత్ర జీవ‌క్ బీజ్ పేరుతో మ‌గ‌బిడ్డ కోసం త‌యారు చేస్తున్న మందును బాబా రాందేవ్ ఫార్మ‌సీ విక్ర‌యిస్తోందంటూ విప‌క్ష స‌భ్యులు ప్ర‌భుత్వాన్ని నిల‌దీసారు. అస‌లే ఆడ‌బిడ్డ‌ల సంఖ్య త‌గ్గిపోతోంద‌ని ఆందోళ‌న చెందుతోంటే ఈ బాబా మంగ బిడ్డ‌ల కోసం మందులు అమ్మ‌డం ఏమిటంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ఆ మందు త‌యారు చేసే, అమ్మే సంస్థ‌ల‌ను నిషేధించాల‌ని డిమాండ్ చేశారు. అస‌లు బాబా అమ్మే మందు సేవించిన వారికి మ‌గ‌బిడ్డ‌లు పుడ‌తారో లేదో గాని ఫార్మ‌సీకి మాత్రం లాభాల పంట మాత్రం బాగా పండుతోంది.