ఎయిడ్స్ పై పోరాటానికి ఐశ్వ‌ర్య రాయ్ రెడీ..! 

ప్ర‌తిష్టాత్మ‌క కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో   ఈసారి ఐశ్వ‌ర్య  కేవ‌లం రెడ్ కార్పేట్ మీద న‌డ‌వ‌డ‌మే కాదండోయ్… దీంతో పాటు మ‌రో మంచి కార్య‌క్ర‌మంలోకూడా పాలు పుంచుకోబోతున్నారు.  ఎయిడ్స్ మ‌హమ్మారి పై   పోరాటానికి  నిధులు సేక‌రించేందుకు  చిత్రోత్స‌వంలో  ఓ ప్ర‌త్యేక  కార్యక్ర‌మం చేయ‌నున్నారు.  ఇందులో  ఐశ్వ‌ర్య  త‌న భ‌ర్త  అభిషేక్ బ‌చ్చ‌న్ తో క‌ల‌సి  నిధుల సేక‌ర‌ణ‌కు  త‌న వంతు స‌హ‌కారం అందించ‌నుంది.ఈ నెల 21న జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో  హాలీవుడ్ నుంచి  ఎవాలొంగిరియా, కార్లీ క్లాస్ లాంటి  తార‌లు పాల్గొన‌నున్నారు.