వ‌డ్డీ వ్యాపారుల వేధింపుల‌కు వ్యాపారి ఆత్మ‌హ‌త్య‌!

న‌గ‌రంలో వ‌డ్డీ వ్యాపారుల ఆగ‌డాల‌కు మ‌రో నిండుప్రాణం బ‌లైంది. సికింద్రాబాద్ లో వ‌డ్డీ వ్యాపారుల వేధింపులు భ‌రించ‌లేక ఓ వ్యాపారి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్థానిక తుకారంగేట్‌లో నివాస‌ముంటున్న న‌ర్సింగ్ అనే వ్యాపారికి అప్పులున్నాయి. వీటిని తీర్చాల‌ని కొంత‌కాలంగా వ‌డ్డీవ్యాపారులు వేధిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ్యాపారులు అప్పు తీర్చాల‌ని న‌ర్సింగ్‌ను తీవ్రంగా కొట్టారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు న‌ర్సింగ్ రికార్డు చేశాడు. త‌న‌షాపులోనే త‌న‌ను కొట్ట‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. వాటిని సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేశాడు. ఈ సూసైడ్‌నోట్ రాసి అదృశ్య‌మ‌య్యాడు. మంగ‌ళ‌వారం ఉద‌యం నర్సింగ్ మృత‌దేహాన్ని పోలీసులు క‌నుగొన్నారు. వీడియోల ఆధారంగా వ‌డ్డీ వ్యాపారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న‌ర్సింగ్ భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న‌తో న‌ర్సింగ్ భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు రోడ్డు మీద ప‌డ్డారు.