సన్నీ లియోన్ కన్నడకి షిఫ్ట్ అయ్యింది..

ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీ లలో ఐటెం గాళ్ అంటే వినిపించే ఏకైక పేరు సన్నీ లియోన్. ఏ ముహుర్తానా జిస్మ్ 2 లో ఛాన్స్ వచ్చిందో కానీ, సన్నీ జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఇప్పుడు సన్నీ లైఫ్ ఎంత మారినా కాని తన గతాన్ని మాత్రం ఎవరు మర్చిపోవడం లేదు అని సన్నీ ఫీల్ అవుతుందట. మొన్న అ మద్య ఒక సినిమాకి సన్నీ 5 కోట్లు డిమాండ్ చేసి ఆఫ‌ర్ పోగొట్టుకుంది. ఈ ఒక్కటి చాలు సన్నీ డిమాండ్ ఎంత పెరిగిందో చెప్పడానికి. తాజాగా సన్నీ కన్ను శాండిల్ వుడ్  పైన పడింది.
అప్పట్లో జై సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సన్నీ, తర్వాత బాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ చేసింది. మద్యలో ఒకసారి తెలుగులో కూడా ఒక సినిమా చేసి టాలీవుడ్‌కి కూడా పరిచయం అయ్యింది. కన్నడ డైరెక్టర్ ఇంద్రజిత్ లోకేష్ సినిమాలో ఒక సాంగ్‌కి సన్నీని ఓకే చేశారట, సాంగ్‌తోపాటు చిన్న రోల్ కూడా ఉందట. ఇప్పటికే వరల్డ్ వైడ్ బాగా ఫ్యామస్ అయిన సన్నీలియోన్‌ ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా దానిని వదులుకోవడం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం సన్నీ క్రేజ్ నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..!