అనుష్క డ్రెస్ కోడ్‌తో సతమతమవుతోంది!

స్వీటీ శెట్టి అంటే మన అనుష్కేనండోయి. తన రెండు పెద్ద పీరియడ్ డ్రామాస్ రిలీజ్‌కు సిద్ధమయిపోయాయి. ఇక వాటి ప్రమోషన్స్ గురించి చాలా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం తన వంతుగా మిగిలింది. మరి ‘బాహుబలి ‘ లాంటి సినిమా ప్రమోషన్స్ అంటే మాటలా? ఆకర్షణీయంగా ఉండేలా డ్రెసప్ అయ్యి అప్‌డేటెడ్‌గా కనిపించాలి. పక్కనే ఉంటున్న కో-స్టార్ తమన్నా జిలుగు వెలుగుల వివిధ డిజైనర్ డ్రెసెస్‌లో మెరిసిపోతుంటే, అనుష్క మాత్రం ఫుల్ స్లీవ్స్ అనార్కలి డ్రెసెస్‌లోనే కనిపిస్తోంది దాదాపు అన్ని ఈవెంట్స్‌లో.

ఇందుకు కారణం, ఆమె రాబోయే తమిళ్ సినిమా ‘సైజ్ జీరో ‘ లో ఒక భారీకాయం సమస్య ఉన్న అమ్మాయిగా చేస్తోంది. అందుకోసం దాదాపుగా 15 కి.గ్రా.ల బరువు పెరిగే క్రమంలో ఇప్పటికే చాలా ఒళ్ళు చేసింది. అందుకనే డిజైనర్ వేర్ సూట్ అవ్వవు కనుక డ్రెస్ కోడ్ లాంటిది పాటిస్తోంది అనుష్క. అయినా బొద్దుతనం తెల్సిపోతుంది. తమిళులకు బొద్దుగా ఉన్న గుమ్మలు ఇష్టం కనుక పర్వాలేదు, కాని టాలీవుడ్ మరియు బాలివుడ్ ఆడియెన్స్‌కి సన్నజాజి కొమ్మలే ఇష్టం కనుక, తమన్నా మార్కులు కొట్టేస్తుంటే అనుష్క మాత్రం ఏం చేయలేక అనార్కలి డ్రెస్‌లే శరణ్యం అంటోంది మరి.