చార్మి పచ్చిగా మాట్లాడిందా, పిచ్చిగా మాట్లాడిందా?

చార్మింగ్ గర్ల్ చార్మీ అంటే తెలుగు వారికి ప్రత్యేక అభిమానమే. పంజాబీ అమ్మాయి అయ్యి ఉండీ, తెలుగు చక్కగా మాట్లాడుతుంటే చూడముచ్చటేస్తుంది ఎవరికైనా. కానీ.. ఆ ముద్దు మాటలే పబ్లిక్‌గా హద్దులు దాటితే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా. చార్మి రాబోయే ఫీమేల్-సెంట్రిక్ మూవీ ‘జ్యోతిలక్ష్మి’ ఆడియోలాంచ్ ఈవెంట్‌లో అమ్మడు చేసిన అతి చూసి ముక్కున వేలు వేసుకున్నవారే ఎక్కువ.

     ఆ ప్రొగ్రాంకి యాంకర్ శ్యామల హోస్ట్ చేస్తున్నా, తన స్వంత సినిమా అయినందున, చార్మీ కూడా కో-యాంకరింగ్ అంటూ కాస్త నోరు చేసుకుంది. నీ నడుం అంత సన్నగా ఎలా అయ్యింది అనే శ్యామల ప్రశ్నకు, చార్మీ సిగ్గుల మొగ్గ అయ్యి, తన నడుం..నాభి సౌందర్యం గురించి గొప్పలు ఏ రేంజ్‌లో చెప్పిందంటే.. పూరీ జగనాథ్ తన నాభి కింద ఉన్న చిన్న మడతకు ఫ్యాన్ అయిపోయాడని, పదే పదే అదే విషయం తనతో చెప్పాడని పబ్లిక్‌గా చెప్పింది.

     కొన్ని కాంప్లిమెంట్స్ ప్రైవేట్‌గా ఇచ్చినప్పుడు బాగుంటాయి, కాని పబ్లిక్ గా మాత్రం కాస్త పచ్చిగా అనిపిస్తాయి. ఈ విషయం అర్థం గాక పిచ్చిగా వాగిందా చార్మి అని గుసగుసలు మొదలయ్యాయి. అసలు ఇలాంటి ప్రశ్న వేయడమే కాస్త ఇరిటేటింగ్…ఇక జవాబు సంగతి చెప్పాలా?