అభిమానులు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతున్నారు!

తమ తమ స్టార్ హీరోలపై అభిమానం చాటుకోడానికి సగటు వీరాభిమాని ఏం చేస్తాడు? తన ఫేవరెట్ హీరో ఫిల్మ్ రిలీజ్ రోజున పెద్ద పెద్ద బ్యానర్‌లు కట్టి, నిలువెత్తు పూలమాలలు వేసి, హారతులిచ్చి, నానా హుంగామా చేయడం పరిపాటే. కాని ఈ క్రమంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రిస్క్ తీసుకోడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. తెలుగునాట సిరులు పండించిన పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మూవీ ‘అత్తారింటికి దారేది’ , ‘రన్న’ గా రీమేక్ అయ్యి, సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది.
     ఇంతవరకు బాగానే ఉంది. కాని సుదీప్ వీరాభిమాని ఒకరు, సుదీప్ కోసం పెద్ద బ్యానర్ నిలబెట్టడానికి ట్రై చేస్తూ, కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. కాని ఇలాంటి సంఘటనలు పునారావృతం అవ్వడమే బాధాకరం. మన టాలివుడ్‌లో సైతం ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. తమ ఫ్యాన్స్ క్రేజ్ ని ఎలా క్యాష్ చేసుకుంటారో, అదే విధంగా తమ తమ ఫ్యాన్స్‌లో అభిమానం వెర్రితలలు వెయ్యకుండా జాగృత పరచాల్సిన బాధ్యత మన హీరోలపైన లేదా? ఇందుకు సీనియర్ హీరో వెంకటేష్ అభినందనీయుడు. ఎప్పుడు ఫ్యాన్స్ అతి చేసినా ప్రోత్సహించకుండా.. మందలించేవాడు.