వ‌ద‌ల ‘బాబూ’ వ‌ద‌లా..: త‌ల‌సాని

ఈ మాట‌లు వింటుంటే అరుంధ‌తి సినిమాలో విల‌న్ సోనూసూద్ డైలాగ్‌లు గుర్తుకు వ‌స్తున్నాయి క‌దూ! ‘ఓటుకు నోటు’ కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును వదలం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ‘తెలంగాణ సినిమా – నిన్న- నేడు – రేపు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, రేవంత్‌ల విషయంలో తమ ప్రభుత్వంపై ఒత్తిళ్లు, ప్రభావాలు పని చేస్తున్నాయంటూ కొన్ని పత్రికలు పనిగట్టుకొని రాస్తున్నాయని.. అది వాస్తవం కాదని తెలిపారు. బాబుపై చట్ట పరిధిలో చర్య లు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి భయపడదని తేల్చి చెప్పారు.