బాహుబలి కోసం సూర్య అంత ఎందుకు చేసాడు?

ఇప్పుడు ఎవరి నోటి వెంట విన్నా, ‘బాహుబలి మాటే! ఇక సినీ ప్రియుల సంగతి చెప్పనే అక్కరలేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులు. కేవలం ప్రేక్షకులు, అభిమానులే కాదు… భారతీయ సినిమా ప్రపంచం మొత్తం మన తెలుగు వాడైన రాజమౌళి వైపే చూస్తోంది. తను కూడా చక చకా పనులు చేసేస్తున్నాడు. నిన్న సాయంత్రం చెన్నైలో తమిళ్ వెర్షన్ ట్రెయిలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్‌లో ముఖ్యంగా మెరిసింది హీరో సూర్యానే. తమిళ్ ట్రెయిలర్ లాంచ్ చేసి, రాజమౌళి గురించి, బాహుబలి గురించి చాలా గొప్పగా మాట్లాడి తెలుగు సినిమాపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. సూర్య ఇటీవల తన ‘రాక్షసుడు ‘ ఆడియో లాంచ్ ఈవెంట్‌కోసం వచ్చినప్పుడు రాజమౌళి మరియు ప్రభాస్, ఆ సినిమాను ప్రమోట్ చేసారు. అప్పుడు ఆ వేదిక పైన సూర్య మాటిచ్చాడు, మీరు ఇక్కడ హైదరాబాదులో చూపించిన ప్రేమకు బదులుగా, మీరు చెన్నై వచ్చ్చినప్పుడు ‘బాహుబలి ‘ ప్రచారాన్ని మేము భాధ్యత తీసుకుంటాం అని. అన్న మాట నిలుపుకుని ‘బాహుబలి ‘ ట్రెయిలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగడానికి తన వంతు పాలుపంచుకున్నాడు. గుడ్!