అమిర్ ఖాన్ కు లీగల్ నోటీసు

 బాలీవుడ్ లో మిస్టర్ పర్ ఫెక్ట్ అంటే ఎవరైనా చెప్పే పేరు అమీర్ ఖాన్. వివాదాలకు దూరంగా.. బాక్సాఫీస్ కు దగ్గరగా ఉండడం అమీర్ కు అలవాటు. అలాంటి మిస్టర్ పెర్ ఫెక్షనిస్టుకు కూడా నోటీసులు అందాయి. తనకు తెలియకుండానే అమీర్ ఓ కేసులో చిక్కుకోవాల్సి వచ్చింది. టీవీ రియాల్టీ షోలో సత్యమేవ జయతే చిహ్నాన్ని వాడుకున్నందుకు గాను అమీర్ కు కోర్టు నోటీసులు జారీచేశాడు ఓ సామాజిక కార్యకర్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశాన్నయినా మీడియాలో వాడుకోవాలనుకుంటే.. ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. మరీ ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్న ఎలిమెంట్స్ ను వాడుకోవాలంటే ఆ అనుమతి అత్యవసరం. సత్యమేవ జయతే చిహ్నానికి సంబంధించి అమీర్ టీం ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదనేది ఆ సామాజిక కార్యకర్త వాదన. ప్రస్తుతానికి నోటీసులైతే అమీర్ కు అందాయి. దీనిపై అతడి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కేవలం అమీర్ కు మాత్రమే కాదు.. అతడితో పాటు దర్శకుడు సత్యజిత్ భత్కల్, అమీర్ భార్య, సహ-నిర్మాత అయిన కిరణ్ రావుకు కూడా నోటీసులు అందాయి.