సంగీత బిజలానీగా నర్గీస్

అజారుద్దీన్ జీవితచరిత్రతో బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కనుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు కూడా ఉండబోతున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కథ, స్క్రీన్ ప్లే వ్యవహారాలన్నీ పూర్తయ్యాయి. అజార్ మొదటి భార్యగా ప్రాచీ దేశాయ్ ను ఇప్పటికే ఎంపిక చేశారు. ఇక కీలకమైన అజార్ రెండో భార్య పాత్ర కోసం చాలామంది పేర్లు పరిశీలించింది నిర్మాత ఏక్తాకపూర్. ఫైనల్ గా ఆ గోల్డెన్ ఛాన్స్ నర్గీస్ ఫక్రీని వరించింది. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి తెరపైకొచ్చింది సంగీత బిజలానీ. కాబట్టి ఆమె క్యారెక్టర్ ను పోషించే హీరోయిన్ కు కూడా మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే బాగుంటుందని భావించారు. మొదట దీపికా పదుకోన్ ను సంప్రదించినప్పటికీ.. ఆమె ఆ పాత్ర చేసేందుకు నిరాకరించింది. తర్వాత మరికొంతమంది మోడల్స్ పేర్లు కూడా పరిశీలించారు. ఫైనల్ గా ఆ ఛాన్స్ నర్గీస్ ను వరించింది. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నర్గీస్ కు ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకుంటే.. ఏక్తాకపూర్ సినిమాలన్నీ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్సులు. పైగా అజారుద్దీన్ జీవితచరిత్రతో సినిమా అంటే అది కచ్చితంగా ఇండియాను ఎట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి సంచలనాత్మక సినిమాలో నటిస్తే నర్గీస్ కు కచ్చితంగా పేరొస్తుంది. సోసోగా ఉన్న నర్గీస్ కెరీర్.. సంగీత బిజలానీ రాకతోనైనా ఊపందుకోవాలని ఆశిద్దాం.