ఆర్తి అగర్వాల్ తండ్రి గురించి సురేష్ బాబు బయటపెట్టిన నిజాలు

నిన్నటి వరకు ఆర్తి అగర్వాల్ సినీ అవకాశాల కోసం, తన కరీర్ మళ్ళీ టాలీవుడ్‌లో నిర్మించుకోవాలనుకుంటున్న విషయం ఎవరికీ పట్టలేదు. కాని…ఆమె మరణం తరువాత, ఒక నటిని కోల్పోయామని అందరూ బాధపడుతున్నారు. గ్లామర్ ప్రపంచం ఇంతేనేమో! ఎవరినీ నిందించలేము. ఆర్తి మరణం గురించి…కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అన్నింటిలో ఎంతో కొంత నిజం ఉంది. కాని…ఆర్తి యొక్క ఆర్తికి, స్ట్రగుల్‌కి మూలకారణం మాత్రం ఆమె తండ్రి అని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చెప్పకనే చెప్పారు.

ఆమె సినిమాలలోకి వచ్చిన మొదట్లో, సక్సెస్ ఆమెకు దాసోహం అయ్యింది. ఆమె తండ్రి ఆమెపైన విపరీతమిన ప్రెజర్ పెట్టేవారని, సక్సెస్ కోసం పరుగులు పెట్టించేవారని, ఆమెకు పర్సనల్ స్పేస్ ఇచ్చేవారు కాదని సురేష్ అభిప్రాయపడ్డారు. ఒకసారి తాను కూడా, అతనికి చెప్పే ప్రయత్నం చేసానని, కాని అతను వినే రకం కాదని అర్థం అయ్యి, సైలెంట్ అయిపోయానని, దూరంగా ఉండడం నేర్చుకున్నానని చెప్పారు సురేష్ బాబు. సినిమాలంటే సక్సెస్‌లు ఫెయిల్యూర్‌లూ ఉంటాయనే నిజం ఆర్తి…ఆమె తండ్రి ఇద్దరూ యాక్సెప్ట్ చెయ్యకపోవడం వల్లనే, అవి డీల్ చెయ్యలేకపోయిందని, ఆర్తిని క్లోజ్‌గా అబ్జర్వ్ చేసిన సురేష్ బాబు అనడంలో నిజం ఎంతో ఉంది కదా!