శ్రీదేవి రామ్‌గోపాల్ వర్మకి మంచి ఓపెనింగ్ ఇచ్చింది

ఇది జగమెరిగిన సత్యం. రామ్‌గోపాల్ వర్మకి అతిలోక సుందరి శ్రీదేవి అంటే వెర్రి అభిమానం. ఆ అభిమానం ఎప్పుడు ఒకేలాగా ఉంది. అందుకనే తన రాబోయే సినిమాకు ‘శ్రీదేవి’ అనే పేరు పెట్టి, స్వయంగా శ్రీదేవి భర్త ఆ పేరు తొలగించమని నోటీసులు పంపినా…చలించక అదే పేరుతో వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. ఈ లోపు ఈ శ్రీదేవి వురఫ్ అనుకృతి శర్మ ఊరుకోక రామ్‌గోపాల్ వర్మకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెటింది, తాను కూడా కావాలిసినంత క్రేజ్ తెచ్చుకుంది.

అదెలాగ అంటే… అమ్మడు ఇటీవల విడులైన నారా రోహిత్ సినిమా ‘అసుర’లో ఒక ఐటెమ్ సాంగ్ చేసింది. ఇప్పుడా సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచి, ఒక రేంజ్‌లో రసికులకి కిక్ ఇస్తోంది. ఒకే దెబ్బకు అనుకృతి పాపులర్ అయిపోయింది. రామ్‌గోపాల్ వర్మ హీరోయిన్‌గా పరిచయం కాకముందే, హాట్ ఐటెమ్ గర్ల్‌గా పేరు కొట్టేసింది. త్వరలో విడులయ్యే రాము సినిమా ‘శ్రీదేవి’కి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది కనుక, ఈమె అందాలు చూడడం కోసం… రాము సినిమాకు మంచి ఓపనింగ్స్ వస్తాయి అనడంలో సందేహం లేదు.