కమెడియన్ సుధాకర్ రీఎంట్రీ

కొంతమంది నటులు సడెన్ గా ఫేడవుట్ అయిపోతారు.. మళ్లీ అంతే సడెన్ గా తెరపై కనిపిస్తారు. హాస్యనటుడు సుధాకర్ కూడా అంతే. అనారోగ్య కారణాలతో వెండితెరకు దూరమయ్యారు సుధాకర్. చాన్నాళ్లు హాస్పిటల్ బెడ్ కే పరిమితమయ్యారు. అయితే సుధాకర్ ఇప్పుడు కాస్తోకూస్తో కోలుకున్నారు. అంతేకాదు.. తిరిగి సినిమాల్లో నటించేందుకు కూడా సిద్ధమౌతున్నారు. కోలుకున్న తర్వాత సుధాకర్ చేస్తున్న సినిమా వాడు నేను కాదు. రామ్ శంకర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి కామెడీ పండించడానికి సిద్ధమౌతున్నారు సుధాకర్. కామెడీ ఎక్స్ ప్రెషన్స్ కు కాస్త చిలిపి మాటలు జోడించి హాస్యాన్ని పండించడం సుధాకర్ స్పెషాలిటీ. అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ కూడా అతడి వరం. అందుకే సుధాకర్ పర్ ఫార్మెన్స్ ను ఎవరూ మరిచిపోలేరు. ఇప్పటికీ అతను అందరికీ గుర్తే. రీఎంట్రీలో సుధాకర్ మరోసారి తన మార్కు పంచ్ లతో అందర్నీ కడుపుబ్బా నవ్వించాలని ఆశిద్దాం.