పూరి-నితిన్ సినిమా ఆగిపోయింది

హార్ట్ ఎటాక్ మూవీ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి మరోసారి పనిచేయబోతున్నానంటూ గొప్పగా ప్రకటించాడు నితిన్. అటు పూరి కూడా ఆ న్యూస్ కన్ ఫర్మ్ చేశాడు. చిరంజీవితో 150వ సినిమాకు కమిట్ అయినప్పటికీ.. అది సెట్స్ పైకి వచ్చే గ్యాప్ లో నితిన్ తో సినిమా లాగించేయాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఆ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ప్రకటించాడు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల పూరి జగన్నాధ్ తో సినిమా చేయలేకపోతున్నానని ప్రకటించాడు. అలా ఇద్దరి కాంబోలో రావాల్సిన రెండో సినిమా ఆగిపోయింది. 
          పూరి-నితిన్ సినిమా ఆగిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. వీటిలో ముఖ్యమైంది చిరంజీవి 150వ సినిమా. ఈ సినిమా స్క్రీన్ ప్లేలో చిరంజీవి కొన్ని కీలక మార్పులు చెప్పారట. అంతేకాదు.. సినిమా పూర్తయ్యేవరకు మరో ప్రాజెక్ట్ టేకప్ చేయొద్దని కూడా సూచించారట. దీంతో నితిన్ మూవీని పూరి వదులుకున్నాడని టాక్. మరోవైపు నితిన్ కూడా అఖిల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సిసింద్రీ అఖిల్ సినిమాకు నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల కూడా, తను హీరోగా నటించాల్సిన మూవీని పక్కనపెట్టాడనే వార్తలొస్తున్నాయి.