ప్రేమలో యామీ గౌతమ్

యామీ గౌతమ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలతో నిత్యం బిజీగా ఉండే యామి, ఇన్నాళ్లూ ఎఫైర్లు, డేటింగ్ లకు దూరంగా ఉంది. కామ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ కూడా ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందనే ప్రచారం సాగుతోంది బాలీవుడ్ లో. సహనటుడు పుల్కిత్ సామ్రాట్ తో యామి గౌతమ్ డేటింగ్ చేస్తోందనే వార్తలు హిందీ చిత్రసీమలో గుప్పుమంటున్నాయి. వీళ్లిద్దరూ కలిసి తాజాగా ఓ సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఇద్దరి మనసులు పెనవేసుకున్నాయంటున్నారు. అయితే సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి రూమర్లు పుట్టిస్తుండడం అక్కడ సహజం అనే భావన కూడా కలుగుతోంది. సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చేందుకు హీరోహీరోయిన్ల మధ్య ఏదో ఉన్నట్టు అక్కడి మీడియా పుట్టిస్తుంటుంది. కానీ యామి-పుల్కిత్ సంబంధాన్ని అలా అనుకోవడానికి వీళ్లేదు. ఎందుకంటే.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈ జంట కలిసే ఉంటోందని, కలిసి ఈమధ్యే విదేశీ పర్యటన కూడా సాగించారనే వార్తలొస్తున్నాయి. మరి దీనికి యామీ ఏమంటుందో చూడాలి.