చంద్రబాబు జైలుకు వెళ్లాలి: విజయసాయి రెడ్డి

తమను అన్యాయంగా జైలుకు పంపిన చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తమను జైలుకు పంపిన కుట్రలో చంద్రబాబు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నేరం చేశాడు కాబట్టే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు. ఆధారాలు ఉన్నప్పటికీ చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లన్నీ ట్యాప్‌ అవుతున్నాయని, తమ 120 ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. దేశంలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు అమ్మేది పాటూరి రామారావు, సుజనాచౌదరి మాత్రమేనని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసో లేదో తనకు తెలీదని ఆయన అన్నారు.