ఆర్తి ఆఖ‌రి చిత్రం వ‌చ్చేస్తుంది…!

తెలుగులో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన  ఆర్తి అగ‌ర్వాల్… తక్కువ టైమ్ లోనే   టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే చాల మంది హీరోయిన్స్ మాదిరే.. కొత్త హీరోయిన్స్ రాక‌తో  ఆర్తి కి కూడా అఫ‌ర్స్ త‌గ్గ‌డం..  ఆ త‌రువాత వ్య‌క్తి జీవితంతో  కొన్ని  ఎత్తు ప‌ల్లాలు వెర‌సి సినిమాల‌కు దూర‌మైంది.  మ్యారేజ్ చేసుకుని  అమెరికాలో సెటిల‌య్యింది. అయితే  వైవాహిక జీవితం ఎంతో కాలం నిల‌బ‌డ‌లేదు. పెళ్లి చేసుకున్న రెండు సంవ‌త్స‌రాల‌కే డైవోర్స్ తీసుకోవ‌డం జ‌రిగింది.  తిరిగి   రీ ఎంట్రి ఇచ్చింది. అయితే  పెద్ద‌గా క‌ల‌సిరాలేదు. ఊబ‌కాయం, లంగ్స్  ప్రొబ్ల‌మ్.. వెర‌సి  చివ‌ర‌కు  బ‌రువు త‌గ్గే  లైపో స్కోపి  ట్రీమ్ మెంట్ తీసుకోవ‌డం.. అది విక‌టించ‌డం  ఆర్తి  ప్రాణాలు కోల్పోవ‌డం  జ‌రిగింది.
అయితే  త‌ను న‌టించిన ఆఖ‌రి చిత్రం పై  అభిమానులు ఆస‌క్తిగా వున్నారు.    తెలుగు, హింది భాష‌ల్లో  `ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్` పేరు తో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ పారేప‌ల్లి  సినిమా చేశారు. ఈ చిత్రం  ప్ర‌చార చిత్రం  విడుద‌ల హైద‌రాబాద్ లో చేశారు.సందేశాత్మ‌క చిత్రం గా ఈ సినిమాను చేసిన‌ట్లు చెబుతున్నారు.మ‌రి ఆర్తి  అగ‌ర్వాల్  న‌టించిన ఈ చిత్రం అభిమానుల్ని  ఏ మేర‌కు అల‌రిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.