బోయపాటి, బన్నీ రధం ఆగిపోయినట్టేనా ?

యాక్షన్ సినిమాల దర్శకత్వంలో బన్నీ హీరోగా ఆ మధ్య ఒక సినిమా మొదలవుతున్నట్టు ప్రకటించేసారు. బోయపాటి సినిమాలంటే యాక్షన్ భాగం ఎక్కువగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. కధ పూర్తిగా తయారైన తరువాత ఇప్పుడు బన్నీ కధలో మార్పులు కోరుతూ వినోదానికి పెద్దపీట వెయమని కోరాడట. దీనికి బోయపాటి ససేమీరా అనటంతో ఈ సినిమా పై నీలినీడలు కమ్మినట్లే అని ఫిలిం నగర్ సమాచారం. అయితే ఈ విషయంలో నిర్మాతైన అల్లు అరవింద్ కూడా ఇద్దరికి చెప్పలేకపోతున్నాడని సమాచారం.