రిలీజ్ కు ముందే శ్రీమంతుడు సెన్సేషన్

మహేష్ గత చిత్రం ఆగడు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మొహమాటపడకుండా చెప్పాలంటే ఆగడు సినిమా ఓ ప్లాప్. అలాంటి మూవీ తర్వాత ఏ హీరోకైనా మార్కెట్ లో కాస్త ఆటుపోట్లు తప్పవు. కానీ మహేష్ మేనియా ముందు సినిమా జయాపజయాలు జాంతానై. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీమంతుడు సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో ప్రీ-బిజినెస్ చేస్తోంది. ఈ ఏరియా, ఆ ఏరియా అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాల హక్కులు ఫ్యాన్సీ రేట్లుకు అమ్ముడుపోతున్నాయి. కొన్ని లెక్కలు అధికారికంగా బయటకొస్తుంటే.. మరికొన్ని మాత్రం అనధికారిక లెక్కలే. అంకెలు ఏవైనా.. ట్రెండ్ మాత్రం సెట్ అయింది శ్రీమంతుడుతోనే. తాజాగా ఈ సినిమా నైజాం రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఏకంగా 14 కోట్ల 40లక్షల రూపాయలు చెల్లించి నైజాం హక్కులు దక్కించుకుంది అభిషేక్ పిక్చర్. అటు గుంటూరు ఏరియాకు సంబంధించి ఓ ఎన్నారై 4 కోట్ల 10లక్షల రూపాయలు పెట్టి రైట్స్ కొనుగోలు చేశాడు. వాస్తవానికి గుంటూరులో 3 కోట్లు అంటే చాలా ఎక్కువ. అలాంటిది మహేష్ మూవీని 4కోట్ల 10లక్షలు ఖర్చుపెట్టాడు సదరు ఎన్నారై. వీటితో పాటు మిగతా ప్రాంతాల హక్కులు కూడా కళ్లుచెదిరే రేట్లకు అమ్ముడుపోతున్నాయి. మహేష్-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను జులై 18న సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. సినిమాను ఆగస్ట్ 7న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిర్చి తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ఈ శ్రీమంతుడు.