దీపిక మెచ్చిన ఐదు పాత్రలు

2007లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకోన్. అంతకంటే ముందు ఇండియాలో సూపర్ మోడల్ హోదాలో కొనసాగింది. షారూక్ తో చేసిన ఓంశాంతిఓం సినిమా దీపికకు లైఫ్ ఇచ్చింది. అప్పట్నుంచి ఇప్పటివరకు ఈ 8ఏళ్ల కెరీర్ లో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు దీపికా పదుకోన్ కు. ప్రతి ఏడాది ఓ హిట్ సినిమాతో చెలరేగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రేసింగ్ హీరోయిన్ అనిపించుకుంటోంది. పొడుగుకాళ్ల సుందరిగా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ, తన 8ఏళ్ల కెరీర్ విశేషాల్ని, అనుభవాల్ని మీడియాతో పంచుకుంది. తనకు బాగా ఇష్టమైన ఐదు పాత్రల్ని బయటపెట్టింది. 
                      తొలి సినిమా ఓంశాంతిఓంలో చేసిన పాత్రే ఇప్పటికీ ది బెస్ట్ అంటోంది దీపిక. ఈ సినిమా తర్వాత మళ్లీ షారూక్ తో కలిసి చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ లో కూడా తన పాత్ర అంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఈ రెండు పాత్రల్ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశానని అంటోంది. ఈ రెండు క్యారెక్టర్లతో పాటు.. కాక్ టైల్, ఏ జవానీ హే దీవానీ, పీకూ సినిమాల్లోని పాత్రలే ఇప్పటివరకు తన ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది దీపిక.