చికిత్స పూర్తి అయింది…. పిలిస్తే వస్తా: స‌ండ్ర‌

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌పై బుధవారం విడుదల కానున్న సందర్భంగా ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఏసీబీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. రేవంత్ విడుద‌ల‌కు ముందే ఆయన ఏసీబీ కార్యాలయానికి నాలుగు గంటలకు ఒక లేఖ రాశారు. వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పుల‌తో తాను రాజ‌మండ్రి బొల్లినేని ఆస్ప‌త్రిలో ప‌ది రోజుల‌పాటు చికిత్స పొందాన‌ని, ప్ర‌స్తుతం త‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని అందులో తెలిపారు. ‘తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాయని… విచారణకు అందుబాటులో ఉంటానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని ’’ ఆ లేఖలో స్పష్టం చేసిన‌ట్లు తెలిసింది.