బాహుబ‌లి ఒక్కో టికెట్ ఖ‌రీదు 3 వేలు ..!

క్రేజ్ వున్న చిత్రాల‌కు బెనిఫిట్ షో’ల రూపంలో వ్యాపారం చేయ‌డం సాధార‌ణ విష‌య‌మే. సాధ‌ర‌ణంగా తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్ బాబు చిత్రాల‌కు వీప‌రిత‌మైన క్రేజ్ వుంటుంది. బెనిఫెట్ షోల రూపంలో టికెట్స్ మూడు లేదా నాలుగు వంద‌ల రేటు తో అమ్ముతుంటారు. ఇది సాధ‌ర‌ణ‌మే. క‌ట్ చేస్తే ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి సినిమా బెనిఫిట్ షో రేట్లు వింటుంటే స‌గ‌టు ప్రేక్ష‌కుడికి మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. బాహుబ‌లి వీప‌రీత‌మైన హైప్ క్రియోట్ చేయ‌డంతో ఒక థియేట‌ర్లో బెనిఫిట్ షో వేసుకోవ‌డానికి ప‌ది ల‌క్ష‌లు చెబుతున్నార‌ట‌. దీని ప్ర‌కారం.. ఒక షో కు క‌నీసం 3 వేల రూపాయ‌ల చొప్పున్న అమ్మినా గాని.. గిట్టుబాటు కాద‌నే టాక్ వినిపిస్తుంది. ఇదిలా వుంటే.. ఇంత ధ‌ర పెట్టి చూసే ఆడియ‌న్స్ వుంటారా.??. వున్న ఎంత మంది వుండోచ్చు అనేది సందేహామే . అందుకే బెనిఫిట్ షో టికెట్ ధ‌ర త‌గ్గిస్తే బెట‌ర‌నే టాక్ బ‌లంగా వినిపిస్తుంది.