సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న క్రీడ్ సినిమా ట్రైలర్

హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాలు గాడ్ ఫాద‌ర్ సిల్వెస్ట‌ర్ స్టోన్ న‌టించిన తాజా చిత్రం క్రీడ్. హాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రెయిన్ కూగ్ల‌ర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.సిల్వెస్టార్ ప్ర‌ధాన పాత్ర చేసిన ఈ సినిమా ట్రైల‌ర్ కొ్న్నిగంట‌ల క్రితం విడుద‌ల చేశారు. విడుద‌ల చేసిన కొద్ది గంట‌ల్లోనే ఇంట‌ర్న్ ట్ లో హిట్స్ వెల్లువ కురుస్తోంది. ట్రైల‌ర్ రిలీజై 24 గంట‌లైన గ‌డ‌వ‌క ముందే.. 31 ల‌క్ష‌ల మంది వీక్షించారు.బాక్సింగ్ ఛాంపియ‌న్ రాకీగా ఒక యువ‌కునికి బాక్సింగ్ నేర్పించే శిక్ష‌కుడిగా సిల్వెస్ట‌ర్ న‌టించారు.మిచ‌ల్ జోర్డాన్ హీరోయిన్ గా న‌టించారు. ఈ చిత్రం ఈ యేడాది నవంబ‌ర్ 25న రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు.