శ్రీమంతుడు షూటింగ్ పూర్తి

మహేష్ బాబు-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న శ్రీమంతుడు సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. రెండు పాటలు మినహా టోటల్ టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకుంది శ్రీమంతుడు సినిమా. మిగిలిన రెండు పాటల్ని హైదరాబాద్ లో ఈ నెలాఖరునాటికి పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. శ్రీమంతుడు ఫస్ట్ లుక్ తోపాటు ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మహేష్ మూవీపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని మరింత పెంచుతూ.. త్వరలోనే మరో వీడియో రిలీజ్ చేయాలని నిర్ణయించాడు దర్శకుడు కొరటాల శివ. మరీ ముఖ్యంగా డైలాగ్ ప్రోమో విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే బాహుబలి సినిమాతో క్లాష్ కాకుండా  ఉండేందుకు.. బాహుబలి మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత శ్రీమంతుడు డైలాగ్ ప్రోమోను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే బాహుబలి కోసం సినిమా విడుదల తేదీని కూడా వాయిదావేసుకున్నాడు మహేష్. ఆగస్ట్ 7న శ్రీమంతుడు సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.