రోడ్డు ప్ర‌మాదంలో ఏడుగురు దుర్మ‌ర‌ణం

గుంటూరు జిల్లాలోని ఈపూర్ మండలం కొండ్రముట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎరువుల‌తో వెళుతున్న ఓ లారీ.. బైకును తప్పించబోయి.. విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలోని ఏడుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మృతి చెందిన వారంతా ప్ర‌కాశం జిల్లాకు చెందిన వారుగా చెబుతున్నారు. అతి వేగ‌మే ఈ దుర్ఘ‌ట‌న‌కు కార‌ణంగా తెలుస్తోంది.