మ‌గ‌థీర , అత్తారింటికి దారేది రికార్డులు బ‌ద్ద‌లయ్యాయి..!

ఈ ద‌శాబ్డంలో  తెలుగు  ఫీల్మ్ మేక‌ర్స్   రికార్డులు  సృష్టించ‌డం.. అలాగే బ‌ద్ద‌లు కొట్ట‌డం వంటి విష‌యాల్లో బాలీవుడ్ వారితో పోటి ప‌డుతున్నార‌న‌డంలో సందేహాం లేదు.  ద‌ర్శకుడు పూరి జ‌గ‌న్నాధ్.. మ‌హేష్ బాబు , ఇలియానా లీడ్ రోల్స్ లో చేసిన పోకిరి చిత్రం ఒక రేంజ్ హిట్ కొట్టింది.  స‌రికొత్త రికార్డ్స్  సృష్టించింది.  దాదాపు 40 నుంచి 60 కోట్ల వ‌ర‌కు క‌లెక్ట్ చేసింది. ఈ రికార్డ్ ను   ద‌ర్శ‌క జ‌క్క‌న్న రాజ‌మౌళి , రామ్ చ‌ర‌ణ్ తో క‌ల‌సి  మ‌గ‌ధీర చిత్రంతో   స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.  ఈ చిత్రం  పోకిరి సృష్టించిన  క‌లెక్ష‌న్ల రికార్డ్ ను  9 రోజుల్లోనే  బ‌ద్ద‌లు కొట్టేసింది.    మ‌గ‌థీర ఫుల్ ర‌న్ లో దాదాపు 80 కోట్ల వ‌ర‌కు క‌లెక్ట్ చేసి   స‌రికొత్త రికార్డ్  నెల‌కొల్పింది.

ఇక అబ్బాయి రాంచ‌ర‌ణ్ మ‌గ‌థీర రికార్డ్ ను  ..బాబాయ్  ప‌వ‌న్ క‌ళ్యాణ్..  త్రివిక్ర‌మ్ తో క‌ల‌సి అత్తారింటికి దారేది చిత్రంతో   బ్రేకే చేశాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్  ర‌న్ లో దాదాపు 90 కోట్లు వసూలు చేసి..వంద కోట్ల‌కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది.  అయితే  ఇప్ప‌డు బాహుబ‌లి చిత్రం  ఇప్ప‌టి వ‌ర‌కు  టాలీవుడ్ లో వున్న రికార్డ్స్  అన్నింటిని మొద‌టి  వారంలోనే బ‌ద్ద‌లు కొట్టేసింది.   5వ రోజుకే  బాహుబ‌లి విడుద‌లైన అన్ని భాష‌ల్లో క‌ల‌పి  2 వంద‌ల కోట్ల మార్క్ దాటింద‌ని   టాక్ వినిపిస్తుంది.    మ‌రి బాహుబ‌లి ఫుల్ లెంగ్త్ ర‌న్  లో ఎన్ని ఇంకెన్ని కోట్లు వ‌సూలు చేస్తుందో …లెట్స్ వెయిట్ అండ్ సీ.!