అవ‌న్నీ పుకార్లే..!

గోలి సోడా అనే చిత్రం వినే వుంటారు కొంద‌రు. తెలుగులో చూసిన వాళ్లు త‌క్కువే. ర‌జ‌నీకాంత్..స‌మంత ఈ సినిమాను చూసి ఎంత‌గానో మెచ్చుకున్నారు. ఇది త‌మిళ నాట తెర‌కెక్కిన చిత్రం. విజ‌య్ మిల్ట‌న్ అనే డైరెక్ట‌ర్ ఒక రియ‌లిస్టిక్ పాయింట్ ను హార్ట్ టిచింగ్ తెర‌కెక్కించి విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు పొందాడు. మార్కెట్ లో కూర‌గాయ‌ల మూట‌లు దింపే ఆరుగురు అనాధ పిల్ల‌ల జీవిత‌మే గోలిసోడా. అనాధ జీవితం నుంచి రెస్ప‌క్ట‌ఫుల్ లైఫ్ ను ఎలా అందుకో గ‌లిగారు అనే పాయింట్ ను హైల్ ట్ చేస్తూ ఈ చిత్రాన్ని చేశారు. క‌ట్ చేస్తే..ఈ సినిమాను తెలుగు లో కిక్ సినిమా ద‌ర్శ‌కుడు సురెంద‌రెడ్డి రీమేకే చేస్తున్నార‌నే టాక్‌ వినిపిస్తుంది.
ప్ర‌స్తుతం ర‌వితేజ తో కిక్ 2 చిత్రం చేశాడు. ఈ చిత్రం త‌రువాత లగ‌డ పాటి శ్రీద‌ర్ నిర్మాణంలో గోలిసోడా సినిమాను చేస్తున్నార‌నే టాక్ బాగా వినిపిస్తుంది. అయితే ద‌ర్శ‌కుడు మాత్రం ఇవ‌న్ని వ‌ట్టి పుకార్లేన‌ని కొట్టి పారేశాడు. గోలిసోడ వంటి చిత్రాలు మంచివే అయిన‌ప్ప‌టికి.. ఇక్క‌డ బిజినెస్ ప‌రంగా అంత వ‌ర్కువుట్ కావ‌ని చెప్పారు. సో .. గోలీసోడా మీద వ‌చ్చిన‌వ‌న్ని రూమ‌ర్సే అన‌మాట‌.