325కోట్లకు అమ్ముడయిన బాహుబలి2 ?

బాహుబ‌లి  మొద‌టి పార్ట్ విజృంభ‌ణ ఏ రేంజ్ లోఉందో తెలిసిందే. దీంతో సెకండ్ పార్ట్ ను అప్పుడే ఒక  కార్పోరేట్ కంపేనీ  దాదాపు 325 కోట్ల‌కు కొనేశార‌ని టాక్ వినిపిస్తుంది.  ప్ర‌భాస్ , రానా,  అనుష్క‌, త‌మ‌న్నాల‌తో  ద‌ర్శ‌క దిగ్గ‌జం  రాజ‌మౌళి చేసిన   బాహుబ‌లి   ప్ర‌పంచ వ్యాప్తంగా  దుమ్ము లేపుతుంది. 

ఇంత‌కు  సెకండ్ పార్ట్ ను అప్పుడే ఎవ‌రు కొనేశారు ..అస‌లు ఈ వార్త ఎలా పుట్టింది.. ఎక్క‌డ నుంచి  పొగ వ‌చ్చింది అనేగా మీ సందేహాం.  సోర్స్   పెద్ద సోర్సేనండోయ్..!  మ‌న ద‌ర్శ‌క జీనియ‌స్ రామ్ గోపాల్‌వర్మ  ట్విట్ చేశాడు.  ఆయ‌న ఈ మ‌ధ్య సినిమాల‌కంటే..ట్విట్స్ కు ఎక్కువ  ఇంపార్టెన్స్  ఇస్తున్నారు. ఏదో స‌ర‌ద‌గా రాసివుంటారు అనుకుంటున్నారు కొంద‌రు. అయితే వ‌ర్మ  లాంటి పాపుల‌ర్ ద‌ర్శ‌కుడికి..తెలియ‌కుండా  ఉంటుందా అనేది మ‌రి కొంద‌రి న‌మ్మ‌కం. అయితే ఎలా చూసిన మొద‌టి పార్ట్ సాధిస్తున్న కలెక్ష‌న్స్ ను బ‌ట్టి..  బాహుబ‌లి రెండో భాగాన్ని  కార్పోరోట్ కంపెనీ వాళ్లు ఆ ధ‌ర చెల్లించి కొనుగోలు చేసే వుంటార‌నేది ఎక్కువ మంది న‌మ్మ‌కం మ‌రి.!