అంతా నాన్న గారే చేశారు.!

ఓటుకు నోటు కుంభ‌కోణం కేసులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వేం న‌రేంద‌ర్ రెడ్డి కుమారుడు కీర్తి కృష్ణ‌న్‌ని ఏసీబీ బుధ‌వారం విచారించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఏసీబీ అత‌నిపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది! మీకు పార్టీ కి ఏం సంబంధం?  రేవంత్ రెడ్డి, సెబాస్టియ‌న్‌ల‌తో ఎందుకు మాట్లాడార‌ని ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. త‌న‌కు అస‌లు రాజ‌కీయాలంటే ఆస‌క్తి లేద‌ని, త‌న ఫోన్ నుంచి నాన్న గారే ఆ ఫోన్‌కాల్స్ చేసిన‌ట్లు స‌మాధాన‌మిచ్చాడ‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్నీ నాన్న గారే చూసుకున్నార‌ని చెప్పాడని స‌మాచారం. ఏసీబీ వ్యూహాత్మ‌కంగా సంధించిన ప్ర‌శ్న‌ల‌కు యువ‌కుడైన కృష్ణ‌కీర్త‌న్‌ను కాస్త అయోమ‌యానికి గురైన‌ట్లు తెలిసింది. ఈ అయోమ‌యంలోనే కీల‌మైన స‌మాచారంపై నోరుజారిన‌ట్లు తెలిసింది. దీంతో అత‌నిచ్చిన స‌మాచారం ఆధారంగా వేం న‌రేంద‌ర్ రెడ్డిని మ‌రోసారి ప్ర‌శ్నించేందుకు ఏసీబీ సిద్ధ‌మ‌వుతోంది.