తన అందానికి కారణం చెప్పేసిన అనుష్క

ప్ర‌స్తుతం అనుష్క మేనియా అంటే క‌రెక్ట్. బాహుబ‌లి చిత్రంలో అనుష్క చేసింది  డి గ్లామ‌ర‌స్ రోల్ ( మొద‌టి భాగంలో)  అయిన‌ప్ప‌టికి..సినిమా క‌థ‌కు గుండెకాయ లాంటి రోల్ అది.  సెకండ్ పార్ట్ లో   అనుష్క క‌త్తి  పోరాటాలు..గుర్ర‌పు స్వారీలు  క‌నిపిస్తాయి.  ప్ర‌స్తుతం  బాహుబ‌లి  క్రియేట్ చేస్తున్న క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం తెలిసిందే. 
 
ఇదిలా వుంటే.. ఈ బెంగ‌ళూరు బ్యూటీ త‌న బ్యూటీ సీక్రేట్స్  చెప్పిసందండోయ్. మ‌న అందాన్నీ, ఆరోగ్యాన్న్నీ నిర్ణ‌యించేది ఆహార అల‌వాట్లే, మ‌నం ఏం తింటామో, అదే మ‌న మొహంలో క‌నిపిస్తుంది. అందుకే కూర‌గాయ‌లూ పండ్లు స‌లాడ్స్..జ్యూస్ లు ఎక్కువుగా తీసుకుంటుంద‌ట‌. ఏం తిన్నా ఎనిమిదిలోపే,  నిద్ర పోవ‌డానికి ముందు ఎలాంటి  ఆహారం తీసుకోద‌ట‌. ఇదే త‌న బ్యూటీ సిక్రెట్ అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ‌.  ఇక బాహుబ‌లి త‌రువాత అనుష్క‌..రాణిరుద్ర‌మ చిత్రంతో అల‌రించ‌డానికి సన్నద్దం అవుతున్న విష‌యం తెలిసిందే.