రెండు నెలల్లో రెండు సినిమాలు

మాస్ మహారాజ్ రవితేజ మళ్లీ తన పాత స్టయిల్ లోకి వచ్చేశాడు. వరుసగా ఫ్లాపులు రావడంతో బలుపు టైమ్ లో గ్యాప్ తీసుకున్న ఈ హీరో, ఇప్పుడు మళ్లీ తన ఓల్డ్ స్టయిల్ ను బయటకు తీశాడు. గ్యాప్ లేకుండా సినిమాలు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి నెలకో సినిమా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు రవితేజ. ఆగస్ట్ లో కిక్-2 సినిమాను, సెప్టెంబర్ లో బెంగాల్ టైగర్ సినిమాను బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలోకి దింపాలని ఫిక్స్ అయ్యాడు. 
                      సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్-2 సినిమా చేశాడు రవితేజ. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మహేష్ శ్రీమంతుడు సినిమా తర్వాత కిక్-2ను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ మూవీ విడుదలైన 3 వారాల గ్యాప్ లోనే బెంగాల్ టైగర్ సినిమాను కూడా రిలీజ్ కు సిద్ధం చేశాడు మాస్ రాజా. సంపత్ నంది దర్శకత్వంలో తమన్న, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 17న విడుదల చేయాలని భావిస్తున్నారు.