అందర్నీ షాక్ కు గురిచేసిన అనుష్క

బాహుబలి పార్ట్-1 విడుదలైపోవడంతో అనుష్క వెంటనే మరో ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అయింది. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘సైజ్ జీరో’ సినిమా చేస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది బొమ్మాళి. అందుకే బాహుబలి ప్రమోషన్ కు కూడా దూరంగా ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా షూటింగ్ లొకేషన్ లో ప్రత్యక్షమైన అనుష్క ను చూసి అంతా షాకయ్యారు. అంత ఎత్తుతో భారీ కాయంతో అనుష్క కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోయారు. అవును.. అనుష్క ఇప్పుడు బాగా బొద్దుగా తయారైందంటూ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ కూడా చేశాడు. ఆ కాయంతోనే అనుష్క పాల్గొనగా, రామోజీ ఫిలింసిటీలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. భారీకాయంలో సన్నివేశాలు పూర్తవ్వడంతో.. అనుష్క ఇప్పుడు మళ్లీ బరువు తగ్గే పనిలో పడింది. సరిగ్గా నెల రోజుల్లో మళ్లీ స్లిమ్ ఫిజిక్ ను సొంతం చేసుకొని బాహుబలి-2 సినిమాకు సిద్ధమైపోవాలనేది అనుష్క టార్గెట్. నిజంగా షార్ట్ గ్యాప్ లో ఇలా బరువు పెరిగి తగ్గడం అనేది ఎంతో కమిట్ మెంట్ ఉంటే తప్ప సాధ్యం కాదు