జర నవ్వండి ప్లీజ్ 152

ఆశ్చర్యం
చిన్ని: గుడ్డులోంచి కోడిపిల్ల రావడం ఆశ్చర్యం కదూ!
బన్ని: కాదు, ఆ కోడిపిల్ల గుడ్డులోకి ఎలా వెళ్ళిందన్నదే ఆశ్చర్యం!
———————————————-
పరీక్ష
తండ్రి: పరీక్ష ఎలా ఉంది?
కొడుకు: ఏం పరీక్షో!  అన్నీ ప్రశ్నలే డాడీ!
———————————————-
మీ ఇష్టం
ఆమె: బస్‌లో ముందు ఎక్కమంటారా? వెనక ఎక్కమంటారా?

కండక్టర్‌: రెండూ ఒకేసారి ఆగుతాయి. మీ ఇష్టం
———————————————-
భవిష్యత్‌
టీచర్‌: హిస్టరీ టీచరంటే ఎవరు?
విద్యార్థి: ఫ్యూచర్‌ గురించి ఆలోచించని వాడు!