26న మోదుగుపూలు మాస ప‌త్రికావిష్క‌ర‌ణ‌

మోదుగుపూలు మాస ప‌త్రికావిష్క‌ర‌ణ స‌భ 26న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వ‌హించ‌నున్నారు. ప్రజాసాంస్కృతిక గొంతుకై తెలంగాణ స‌మాజం ముందుకు వ‌స్తున్న‌  మోదుగుపూలును పాఠ‌కులు ఆద‌రించాల‌ని ఎడిటర్‌ భూపతి వెంకటేశ్వర్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో కోరారు. టిపిఎస్‌కె హా ల్‌ లో సాయంత్రం 5గంటలకు  ‘మోదుగు పూలు’ మాస‌ప‌త్రిక‌ను  సినీనటుడు మాదాల రవి ఆవిష్కరించ‌నున్నారు. ఆవిష్క‌ర‌ణ సభకు ప్రముఖ కవులు నిఖిలేశ్వర్‌, శివారెడ్డి తెలంగాణ సాహితీ కన్వీనర్‌ కె.అనందాచారి, నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్‌ ఎస్‌.వీరయ్య, టిపిఎస్‌కె కన్వీనర్‌ జి.రాములు హాజ‌రు కానున్నారు.