లండన్ లో ఖుషీగా ఎన్టీఆర్

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడుయంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సినిమా కోసం ఓ కొత్త లుక్ కూడా ట్రైచేశాడు. షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. దాదాపు నెల రోజుల పాటు లండన్ షెడ్యూల్ ఉండడంతో.. ఫ్యామిలీకి దూరం కాకూడదనే ఉద్దేశంతో భార్య-కొడుకుతో పాటు లండన్ లో వాలిపోయాడు ఎన్టీఆర్. అంతేకాదు.. కొడుకు అభయ్ రామ్ పుట్టినరోజు వేడుకల్ని కూడా లండన్ లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న అభయ్ రామ్ ఫస్ట్ బర్త్ డే. ఆ తొలి పుట్టినరోజు వేడుకను లండన్ లోని షూటింగ్ స్పాట్ లోనే సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్, అతడి భార్య ప్రణతితో పాటు సినిమా యూనిట్ అంతా పాల్గొంది. షూటింగ్ తొందరగా పూర్తిచేసి నిన్నంతా కొడుకుతోనే గడిపాడు ఎన్టీఆర్. ఆగస్ట్ నెలాఖరు వరకు ఎన్టీఆర్ లండన్ లోనే ఉంటాడు. ఆ తర్వాత కూడా ఇండియా రాడు. సెప్టెంబర్ వరకు యూరోప్ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాతే ఇండియాకు తిరిగొస్తాడు తారక్. సినిమాలో తారక్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.