సెప్టెంబర్ 15 నుంచి బాహుబలి-2

బాహుబలి సినిమా థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తోంది. ఊహించని వసూళ్లు సాధిస్తోంది. దీంతో హ్యాపీగా ఉన్న సినిమా యూనిట్ పండగ చేసుకుంటోంది. ప్రస్తుంత యూనిట్ కు చెందిన చాలామంది ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉన్నారు. కొన్నాళ్లు అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత బాహుబలి పార్ట్-2ను సెట్స్ పైకి తీసుకొస్తామని రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు పార్ట్-2 షూటింగ్ కు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశాడు. సెప్టెంబర్ 15 నాటికి నటీనటులంతా సెట్స్ పైకి వచ్చేయాలని జక్కన్న అందరికీ ఆదేశాలు జారీచేశాడని సమాచారం. ఈలోగా లొకేషన్ల వేటను పూర్తిచేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే రాజమౌళి, తన కుటుంబసభ్యులతో కలిసి ఓ చిన్న వెకేషన్ పూర్తిచేసుకొచ్చాడు. అటు ప్రభాస్ కూడా ఓ 10రోజులు యూరోప్ లో జాలీగా తిరిగి రావాలనుకుంటున్నాడు. మరోవైపు రానా, అనుష్క మాత్రం వేర్వేరు సినిమాలతో బిజీ అయిపోయారు. వీళ్లంతా సెప్టెంబర్ 15నాటికి తిరిగి ఒకే సెట్స్ పైకి రాబోతున్నారు. బాహుబలి పార్ట్-2కు సంబంధించి ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే.