విడుదలకు సిద్ధమైన మంత్ర-2

జ్యోతిలక్ష్మి మూవీ తర్వాత చార్మి నటించిన మంత్ర-2 విడుదలకు సిద్ధమైంది. చాన్నాళ్లుగా విడుదలకు నోచుకోని ఈ సినిమాను ఈనెల 31న విడుదల చేయాలని నిర్ణయించారు. బాహుబలి  మేనియా కాస్త తగ్గడం, మరో భారీ బడ్జెట్ సినిమా దగ్గర్లో రిలీజ్ కు లేకపోవడంతో మంత్ర-2ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మంత్రలాంటి సూపర్ హిట్ తర్వాత మంత్ర-2ను తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు నిర్మాతలు. అయితే మంత్ర సినిమాకు మంత్ర-2కు ఎలాంటి సారూప్యత ఉందనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. తాజా సమాచారం ప్రకారం రెండు సినిమాలు హారర్-సస్పెన్స్ జానర్ లో తెరకెక్కినవే తప్పిస్తే.. కథా పరంగా 2 సినిమాల మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. గ్రీన్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో ఎస్వీ సతీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే మంత్ర-2 ముందున్నది కేవలం వారం రోజులు మాత్రమే. మంత్ర-2 విడుదలైన వారం రోజులకు అంటే ఆగస్ట్ 7కు మహేష్ శ్రీమంతుడు సినిమా విడుదలవుతుంది. కాబట్టి.. ఈ వారంలో వచ్చే వసూళ్లే మంత్ర-2కు చాలా కీలకం.