పరిటాల సునీత కాన్వాయ్‌ ఢికొని నలుగురికి గాయాలు!

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం అరికి రేవుల సమీపంలో ఏపీ మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌లోని ఒక వెహికల్ ఢీకొని ఒక కుటుంబానికి తీవ్ర గాయాలయినట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలోనే ఉండడంతో ఆయనతో మాట్లాడడానికి, పనిలోపనిగా పుష్కర స్నానమాచరించడానికి పరిటాల సునీత వెళ్ళినట్టు తెలుస్తోంది. మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని అనుసరిస్తున్నకాన్వాయ్‌ వాహనం ఢికొట్టిన ఈ సంఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు గాయపడ్డారు. బైక్‌పై వెళుతున్న ఎ.రాజు, అతని భార్య సంతోష్, ఇద్దరు పిల్లలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిని అక్కడున్న స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించగా వారిలో పిల్లలిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.