బాలీవుడ్ లో మరో ఛాన్స్

కమల్ కూతురు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ శృతిహాసన్ బాలీవుడ్ లో మరో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. బిలియన్ క్లబ్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించేందుకు సిద్ధమౌతోంది శృతిహాసన్. ఈ ఏడాది ఇప్పటికే 3 సినిమాల్లో నటిస్తోంది శృతిహాసన్. అజయ్ దేవగన్ సినిమాతో కలుపుకుంటే ఆమె హిందీ సినిమాల సంఖ్య ఈ ఏడాది 4కు చేరుతుంది. ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి, డర్టీ పిక్చర్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన మిలాన్ లూథరియా డైరక్షన్ లో శృతిహాసన్ నటించనుంది. ఈ మేరకు అగ్రిమెంట్ పై సంతకం కూడా చేసింది శృతిహాసన్. తెలుగు-తమిళ్ లో చేస్తున్న రెండు సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే, అజయ్ దేవగన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో జాన్ అబ్రహాంతో వెల్ కం బ్యాక్ అనే సినిమా చేసింది శృతిహాసన్. మరోవైపు విద్యుత్ జమాల్ తో కలిసి యారా అనే సినిమా కూడా చేస్తోంది. ఇంకోవైపు జాన్ అబ్రహాంతోనే రాకీ హ్యాండ్సమ్ అనే మరో సినిమా కూడా చేస్తోంది. ఈ మూడు సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే ఈ మూడు విడుదలవుతాయి. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో ఒప్పుకున్న సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.