రెండు నిండు ప్రాణాలు బలిగొన్న అగ్రిగోల్ద్

అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసిన పాపానికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. విజయవాడలో భవానీపురానికి చెందిన వృద్ధ దంపతులు వెంకటనారాయణ శర్మ, ఆయన భార్య సుందరి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు అగ్రిగోల్డ్ సంస్థలో రూ.6 లక్షలు డిపాజిట్ చేశారు. దానిపై వడ్డీ వస్తుందని ఆశపడ్డారు. రెండేళ్ళుగా దానిపై ఒక్క పైసా కూడా ఆదాయం రాకపోవడం, ఈ సంస్థ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో బలవంతంగా ప్రాణం తీసుకున్నారని పోలీసులు తెలిపారు. పైగా వీరికి క్యాన్సర్‌‌‌తో బాధపడుతున్న కొడుకు ఉన్నాడు. అతనికి వైద్యం కూడా చేయించలేని నిస్సహాయస్థితి వీరిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. తమ కొడుకుకు చికిత్స చేయించలేక మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నట్టు స్థానికులు చెప్పారు. ఈ వృద్ధ దంపతుల ఆత్మహత్యతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.