ఒత్తిడిలో రాజమౌళి… ?

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళికి బాహుబలి 2 సినిమాతో చాలా కష్టాలు వచ్చి పడ్డాయనే చెప్పాలి. మొదటి భాగంలో ఎన్నో అందమైన సన్నివేశాలు, జలపాతాలు, రాజ్యం కోసం వేసిన సెట్స్  చూసిన ప్రేక్షకులు అద్భుతం అని కితాబిచ్చేశారు. దీంతో రెండో భాగంపై ప్రేక్షకులకి ఆసక్తితోపాటు కట్టప్ప‌ బాహుబ‌లిని చంపడానికి కారణాలపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడిదే విషయంపై రాజమౌళీ తీవ్ర కసరత్తులు చేస్తున్నారట. 
రెండో భాగంలో భళ్లాల దేవునితో యుద్ధంలో బాహుబలి వీరత్వాన్ని అదిరిపోయే రీతిలో చూపించ‌డానికి భారీ ఎత్తున సెట్స్, ఫైట్ సీక్వెన్సులుపై బాగా కసరత్తు చేస్తున్నారట. కొంతమంది బాలీవుడ్ నటులతోపాటు, హాలీవుడ్ నుంచి కొంతమంది ఫైటర్స్‌ని కూడా పెడితే మార్కెట్‌ పరంగా బాగుంటుందని ఓ అంచనా. అందుకోసం బాలీవుడ్ ప్రేక్షకులని సంతృప్తి పరచడానికి అక్కడి నటులని కొంతమందిని పెట్టి వారి పాత్రలకు తగు రీతిలో న్యాయం చేసే విధంగా కసరత్తు చేస్తున్నారట. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్ప‌గా సత్యరాజ్ వంటి కీలక పాత్రలను ఇంతకంటే బలంగా చూపించాలి. మొదటి భాగంలో అనుష్క ప్రాముఖ్యం అంతగా లేదనే చెప్పాలి. రెండో భాగంలో అనుష్కాని, మొదటి భాగంలో తమన్నా కన్నా అందంగా చూపించాలి. ఇలా అన్ని చేసి చూపించ గలిగితేనే మరో అద్భుతం చూశామని ప్రేక్షకులు భావిస్తారు. మళ్ళీ వందల కోట్లు కొల్లగొట్టాలంటే… ఇన్ని అలోచనలకి దృశ్యం రూపం ఇవ్వాడానికి రాజమౌళి భారీ కసరత్తు చేసి మరో అద్భుతాన్ని సృష్టించడం కత్తిమీద సాము లాంటి పనే…