పేరోల్‌పై సంజ‌య్‌ద‌త్ విడుద‌ల‌!

సినీన‌టుడు సంజ‌య్‌ద‌త్‌కు మ‌రోసారి పెరోల్ ల‌భించింది. ముంబై పేలుళ్ల కేసు లో పుణె ఎర్రవాడ జైలులో ఐదేండ్ల శి క్ష అనుభవిస్తున్న సినీనటుడు సంజయ్‌దత్ 30 రోజుల పెరోల్‌పై బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. తన కూతురు ఇక్రా అనారోగ్యంతో బాధపడుతున్నదని, ఆమె సర్జరీ కోసం పెరోల్ మంజూరు చేయాలని సంజయ్‌దత్ చేసుకొన్న విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించారు. కుటుంబంతో నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకునేందుకు గత డిసెంబర్‌లో పెరోల్ విడుదలైన సంజయ్.. 14 రోజుల తర్వాత జనవరిలో తిరిగి ఎర్రవాడ జైలుకు చేరుకున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు సంజ‌య్‌కు పెరోల్ మంజూరు చేయ‌డంపై దేశ‌వ్యాప్తంగా ప‌లు విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ఆయ‌న‌కు రాజ‌కీయ నేప‌థ్యం ఉంది కాబ‌ట్టే కావ‌ల‌నుకున్న‌పుడు బెయిల్ ల‌భిస్తుంద‌ని ఆరోపిస్తున్నారు.