బాల‌య్య‌..బాబు గుండెల్లో గోల‌య్య‌

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో పాట‌ను బావ క‌మ్ వియ్యంకుడు చంద్ర‌బాబు ఇప్పుడు పాడుకుంటున్నార‌ట‌. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి..టీడీపీని చేజిక్కించుకున్నార‌నే అప‌ప్ర‌థ పోగొట్టుకునేందుకు.. అన్న‌గారి కుటుంబంలో బాల‌య్య‌ను బాబు చేర‌దీశార‌ని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. అయితే బాల‌య్య ఎప్ప‌టికైనా తోక జాడించే అవ‌కాశం ఉంద‌ని, త‌నయుడు లోకేశ్‌కు బాల‌య్య కూతురుతో వివాహం జ‌రిపించ‌డంలో బాబు చాలా ముందు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించార‌ని నంద‌మూరి కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారి విశ్లేష‌ణ‌. అన్నీ బాబు అనుకున్న‌ట్టే జ‌రిగాయి. కానీ బాల‌య్యకు మాత్రం..చంద్ర‌బాబు కూర్చున్న కుర్చీ త‌న తండ్రిద‌ని..దానికి తానే వార‌సుడిన‌నే ఫీలింగ్ మ‌న‌సులో బాగా నాటుకుపోయింద‌ట‌. అందుకే 2014 ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి మ‌రీ హిందూపురం టిక్కెట్ ప‌ట్టార‌ట బాల‌య్య‌బాబు. బాల‌కృష్ణ గెలిచినా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా బాబు చాలా వ్యూహాత్మ‌కంతా వ్య‌వ‌హ‌రించారు. అయితే బాల‌య్య మాత్రం..సిల్వ‌ర్ స్ర్కీన్ కంటే..పొలిటిక‌ల్ సీనులో ఉండేందుకే ఎక్కువ ఇష్ట‌ప‌డుతున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్న మాట‌. ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల ప‌నితీరుకు బాబు ర్యాంకింగ్‌లు ఇచ్చారు. అనంత‌పురం జిల్లాలో బాగా ప‌నితీరు క‌న‌బ‌రిచే ఎమ్మెల్యేల‌లో బాల‌య్య‌కు ఫ‌స్ట్ ర్యాంకు క‌ట్ట‌బెట్టారు బాబు. దీంతో బాల‌కృష్ణ‌కు ఎక్క‌డాలేని ఉత్సాహం వ‌చ్చేసింద‌ట‌. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జాద‌ర్బార్ పేరుతో సినిమాటిక్ స‌భ‌లు నిర్వ‌హించిన బాల‌య్య‌..ఇటీవ‌ల త‌ర‌చూ ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు కూడా వెళ్లొస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు రాజీనామా చేస్తార‌ని, బాల‌కృష్ణ సీఎం అవుతార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. బాల‌య్య స‌చివాల‌యానికి చేరుకుని అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశాలు కూడా నిర్వహించార‌ట‌. ఇది అప్ప‌ట్లో పెనుదుమారం రేపింది. దీని త‌రువాత కూడా బాల‌య్య సెక్ర‌టేరియ‌ట్‌కు వ‌స్తూనే ఉన్నాడు. 
 బాల‌య్య వెనుక అయ్య‌న్న‌పాత్రుడు?
టీడీపీలో బాబు త‌రువాత, అంత సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న‌పాత్రుడు. అయితే 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం త‌రువాత‌..బాబు కేబినెట్ కూర్పు కంటే ముందు చింత‌కాయ‌ల బాబుపై నిప్పులు చెరిగారు. బాబెవ‌డు..బాబు కంటే నేనే సీనియ‌ర్నంటూ విరుచుకుప‌డ్డారు. ఈ దెబ్బ‌తో చింత‌కాయ‌ల అవుట్ అనే అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా అయ్య‌న్న అమాత్యులైపోయారు. బాబుకు అత్యంత స‌న్నిహితుడైన గంటా శ్రీనివాస‌రావు ఉంటుండ‌గా..చింత‌కాయ‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఎలా వ‌చ్చింద‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే చింత‌కాయ‌ల బాల‌య్య కోటాలో అమాత్యులైపోయార‌ని తెలుగు త‌మ్ముళ్ల గుస‌గుస‌. త‌న‌ను విమ‌ర్శించే ఏ ఒక్క నేత‌నైనా అథఃపాతాళానికి తొక్కేసే బాబు చింత‌కాయ‌లను ఏమ‌న‌కుండా వ‌దిలేయ‌డం కూడా విమ‌ర్శ‌కుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. విశాఖ‌కు చెందిన మ‌రో మంత్రి గంటా శ్రీనివాస‌రావు దూకుడులో ఫేడ‌వుట్ అయిన అయ్య‌న్న‌..బాల‌య్య బ‌లంతో మ‌ళ్లీ బ‌లం పుంజుకున్నాడు. ఇప్పుడు బాబు కేబినెట్లో బాల‌య్య‌కు సంబంధించిన కీల‌క మంత్రి చింత‌కాయ‌ల‌. బాల‌య్య సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లేట‌ప్పుడు అయ్య‌న్న‌పాత్రుడితోనే ఎక్కువ‌గా భేటీ అవుతుంటారు. బాల‌య్య అండ‌తో బాబు కేబినెట్‌లో నిల‌దొక్కుకున్న చింత‌కాయ‌ల‌..గంటా మంత్రి ప‌ద‌వికే ఎర్త్ పెట్టార‌ని విశాఖ వీధుల్లో ప్ర‌చారం సాగుతోంది. బాల‌కృష్ణ‌కు రాజ‌కీయ గురువుగా కూడా అయ్య‌న్నే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మ‌రో వాద‌నా వినిపిస్తోంది. చంద్ర‌బాబుకు ఆగ‌స్ట్ సంక్షోభం త‌ప్పినా.. బావ, వియ్యంకుడైన బాల‌య్య సంక్షోభం వెన్నాడుతూనే ఉంద‌ట‌.