హ‌త్య స‌మ‌యంలో.. షీనా గ‌ర్భ‌వ‌తి!

గ‌డియ‌కో మ‌లుపు, ప్ర‌తి ములుపులోనూ అతి జుగుప్సాక‌ర‌మైన వాస్త‌వాలు, క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు…. వీట‌న్నింటిని క‌ల‌బోతే షీనాబోరా హ‌త్య. ఈ కేసులో క్ష‌ణ‌క్ష‌ణం వెల్ల‌డ‌వుతున్న‌ నిజాల‌తో ఇంద్రాణి నేర‌ప్ర‌వృత్తి, డ‌బ్బు కోసం వావి వ‌ర‌స‌లు, బంధాలను మ‌రిచి ప్ర‌వ‌ర్తించిన తీరు, విచ్చ‌ల‌విడిత‌నం, నేర‌స్వ‌భావం బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇంద్రాణి త‌న మూడో భ‌ర్త కుమారుడు రాహుల్‌తో ప్రేమాయ‌ణం న‌డిపినందన్న కార‌ణంతోనే తాను, తన మొద‌టి భ‌ర్త సంజీవ్‌ ఖ‌న్నాతో క‌లిసి షీనాను హ‌త్య చేసిన‌ట్లు ఇంద్రాణి చెబుతున్న‌ది వాస్త‌వం కాద‌ని ఆమె కుమారుడు మిఖాయిల్ చెప్పిన‌దే నిజ‌మ‌య్యేలా ఉంది. షీనాబోరా హ‌త్య‌కు ఆర్థిక లావాదేవీలే కార‌ణమ‌ని అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.
షీనాను గ‌ర్భ‌వ‌తి చేసింది ఎవ‌రు?
షీనా హ‌త్య‌కు కేవ‌లం ప‌రువు కోణం కాద‌ని ఆమెపేరిట బ్యాంకుల్లో ఉన్న రూ.వంద‌ల కోట్లే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అంతేకాకుండా చ‌నిపోయే స‌మ‌యంలో షీనాబోరా 3 నెలల గ‌ర్భ‌వ‌తి అని స‌మాచారం. షీనా గ‌ర్భానికి ఇంద్రాణితో అత్యంత స‌న్నిహితంగా ఉన్నవ్య‌క్తి కార‌ణమ‌ని తెలియ‌డంతో కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. షీనా అత‌నితో క‌లిసి బ్యాంకాక్‌కు వెళ్లి గ‌డిపిన‌ట్లు తెలుసుకున్న ఇంద్రాణి గొడ‌వ‌కు దిగింది. తాను గ‌ర్భ‌వ‌తిన‌ని అత‌ని బిడ్డ‌కు త‌ల్లిన‌వుతాన‌ని తేల్చి చెప్ప‌డంతో ఇంద్రాణి ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. తన పేరిట విదేశీ బ్యాంకులో భారీ ఎత్తున డిపాజిట్ చేసిన డబ్బును కూడా సొంతం చేసుకుంటానని చెప్పిందని సమాచారం. ఆ డబ్బు సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ ముఖర్జియాలకు చెందిన ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థలో పెట్టిన పెట్టుబడి అని తెలుస్తున్నది. అలాగే భారత్‌కు చెందిన మరో సంస్థకూడా రూ.600 కోట్ల వరకు ఐఎన్‌ఎక్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. ఐఎన్‌ఎక్స్ మూతపడటంతో ఆ సంస్థ కూడా తన డబ్బును వెనక్కు తీసుకోవడానికి అంతగా ప్రయత్నించలేదని తెలిసింది. ఈ డబ్బును దక్కించుకునేందుకే ఇంద్రాణి కూతురును హత్య చేసిందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 
మాట మార్చిన పీట‌ర్‌!
దీనికితోడు  షీనాబోరా త‌న భార్య‌కు కూతురు అన్న సంగ‌తి తెలియ‌ద‌న్న పీట‌ర్ ముఖ‌ర్జియా నిన్న విచార‌ణ‌లో మాట‌మార్చాడు. షీనాబోరా త‌న కూతురు అన్న విష‌యం ఇటీవ‌ల భార్య ఇంద్రాణి త‌న‌తో చెప్పింద‌ని వెల్ల‌డించారు. ఈకేసులో పోలీసులు అత‌ని కుమారుడు రాహుల్‌, ఇంద్రాణి మొద‌టి భ‌ర్త సంజ‌య్ ఖ‌న్నాల‌ను పోలీసులు విచారిస్తున్నారు.
మోసపూరితం.. ఇంద్రాణి జీవితం..
ఇంద్రాణి ఎంత‌టి మోస‌గ‌త్తెనో విచార‌ణ‌లో పోలీసుల‌కు తెలిసింది. 1988లో త‌న 16 ఏట గౌహతిలో త‌ల్లిదండ్రుల వ‌ద్ద ఉంది. త‌రువాత ఇంటి నుంచి పారిపోయింది. 1990లోనే ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఇంటికి వ‌చ్చింది. వారికి సిద్దార్థ్ దాస్ తండ్రి అని చెప్పేద‌ని, కానీ సిద్ధార్థ మాత్రం తాను  ఆ పిల్ల‌ల‌కు తండ్రిని కాద‌ని వాదించేవాడ‌ని, డీఎన్ఏ ప‌రీక్ష‌ల‌కు సైతం సిద్ధ‌ప‌డ్డ‌ట్లు తెలిసింది. 19 ఏట త‌న తొలి వివాహం విష‌యం చెప్ప‌కుండా సంజీవ్‌ను వివాహ‌మాడింది. త‌రువాత పీట‌ర్‌ను పెళ్లాడింది. పీట‌ర్‌ను పెళ్లాడినా సంజీవ్‌తో సంబంధాలు నెరిపేద‌ని, వారిద్ద‌రికీ విధి అనే కూతురుంద‌ని స‌మాచారం. స‌భ్య స‌మాజం త‌లదించుకునేలా ఉన్న‌ ఇంద్రాణి నేర‌చ‌రిత చూస్తుంటే.. పోలీసులకే క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయి.